హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని చెప్పింది. ఝార్ఖండ్ నుంచి ఉత్తర మహారాష్ట్ర మీదుగా.. ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా ఉత్తర మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని చెప్పింది.
వీటి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు తేలిక పాటి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. ఉత్తర, తూర్పు, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇవాళ ఉదయం 8 గంటల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబాబూబ్నగర్, కొత్తగూడెంతో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది.