బాస్మతి బియ్యం : రెండు కప్పులు, పాలకూర తురుము: ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, లవంగాలు: నాలుగు, యాలకుల పొడి: అర టీస్పూను, టమాట తరుగు : అర కప్పు, గరం మసాలా : అర టీస్పూను, జీడిపప్పులు : పావు కప్పు, అల్లం వెల్లులి ముద్ద: ఒక టీస్పూను, నూనె : రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు : రుచికి సరిపడా.
బియ్యాన్ని బాగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. పాలకూర తురుము, అల్లం వెల్లుల్లి ముద్దను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. అందులో నూనె వేసి.. వేడయ్యాక పచ్చిమిర్చి, గరంమసాలా, లవంగాలు, యాలకుల పొడి, జీడి పప్పు వేసి దోరగా వేయించాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, టమాట తరుగువేసి, బాగా కలిపి.. మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్టు, సరిపడా ఉప్పు వేయాలి. మసాలా బాగా వేగాక.. నానబెట్టుకున్న బియ్యం వేసి, రెండునిమిషాలపాటు వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి.. మూత పెట్టేయాలి. చివర్లో కాస్త నిమ్మరసం చల్లి, గరిటెతో ఒకసారి కలిపితే.. పాలక్ పలావ్ రెడీ!