Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
Health tips | ఈ మధ్యకాలంలో షుగర్, బీపీ (Sugar, BP) లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒకసారి మధుమేహం (Diabetes) వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు.
Health tips : ఈ మధ్యకాలంలో షుగర్, బీపీ (Sugar, BP) లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఒకసారి మధుమేహం (Diabetes) వస్తే ఇక దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. కానీ కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్ బారినపడిన చాలామంది రకరకాల ఆహారపు అలవాట్లతో షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా మిల్లెట్స్ షుగర్ నియంత్రణకు బాగా పనిచేస్తాయి.
మధుమేహులు తియ్యని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్లరు. అదేవిధంగా రైస్‌ను కూడా ఒక్కపూటకే పరిమితం చేస్తారు. మిల్లెట్స్ డయాబెటిస్ నియంత్రణలో కీలకం కాబట్టి ఎక్కువగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలు, రొట్టెలనే తింటుంటారు. జొన్న, సజ్జ, మక్కజొన్న, రాగులు, ఊదలు, కొర్రలు, అవిసెలు, అరికలు వంటి ధాన్యాలతో తయారు చేసిన వంటకాలనే ఎక్కువగా తీసుకుంటారు. అయితే మక్కజొన్న సంబంధిత ఉత్పత్తే అయినా కార్న్ ఫ్లేక్స్ జోలికి వెళ్లరు. ఎందుకంటే అవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమట.
అందుకే మధుమేహులు తినకూడని ఆహారపదార్థాల్లో కార్న్ ఫ్లేక్స్ కూడా ఒకటిగా మారిపోయింది. కార్న్‌ఫ్లేక్స్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని చూడగానే ఎవరికైనా వెంటనే తినాలనే కోరిక కలుగుతుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఏ మాత్రం పనికిరావు. వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉంటుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా పెరుగుతాయి. తరచూ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మధుమేహులు కార్న్ ఫ్లేక్స్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

