MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLA Komatireddy | మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ : మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ( MLA Komatireddy ) సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలసి వచ్చి సీఎం అయ్యాడు..దానిని తప్పుపట్టడం లేదు. కొడంగల్ ( Kodangal ) లో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు అభ్యంతరం లేదు. కాని మునుగోడు (Munugode) నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని నిధులు ఇవ్వడం లేదని అన్నారు.
శనివారం మునుగోడులోని పీఆర్ఆర్ గార్డెన్లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు , హెచ్ఎం సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న తపన తనలో ఉందని తెలిపారు.
ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సమానంగా చూడాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి దగ్గరికి చాలాసార్లు వెళ్లానని, మునుగోడుతో పాటు వెనుకబడిన నియోజకవర్గాలను గుర్తించి న్యాయం చేయాలని కోరుతున్నానని స్పష్టం చేశారు. కమిట్మెంట్ ఉన్న బిక్షం గౌడ్ పదవి విరమణ అనంతరం సమాజానికి సేవ అందించాలని సూచించారు.
సమాజంలో అవినీతి పేరుకు పోతుందని, అవినీతి పారద్రోలేంత వరకు పేదలకు న్యాయం జరగదన్నారు. నాయకుడనేవాడు నీతిగా ఉంటే సమాజానికి నీతి వంతమైన పాలన అందించగలరనే నమ్మకంతో బిక్షంగౌడ్ కు పీఆర్టీయూ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని ప్రయత్నం చేశానని వెల్లడించారు. నాయకులు అవినీతికి పాల్పడితే సమాజంలో పేదలకు న్యాయం జరగదని పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

