MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
MLC Dasoju Shravan Kumar | పేదింటి బిడ్డలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు చదువుకునే గురుకులాల్లో పంపిణీ చేసే బెడ్ షీట్లలో కూడా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి సర్కార్ దోపిడీ చేస్తుందని ఫైర్ అయ్యారు.
MLC Dasoju Shravan Kumar | గురుకుల టెండర్లను టెస్కో ద్వారానే ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఒక దోపిడీ వ్యవస్థను ఎట్ల నడుపుతుందనడానికి సోదాహరణంగా మీకు పత్రికా సమక్షంలో ఇవన్నీ ముందు పెట్టామన్నారు.
మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రం (కార్పెట్). మరమగ్గాల మీద పాత వస్త్రాలను రీసైకిల్ చేసి తద్వారా యార్ను తయారు చేసిన వస్త్రం. దాదాపు ఇది రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పేదింటి బిడ్డలకు కార్పెట్లుగా ఇచ్చే పథకం ద్వారా అటు చేనేత కార్మికుల నుంచి ఇటు మఫత్‌లాల్ గుజరాత్‌కు చెందిన కంపెనీ, రకరకాల కంపెనీల దగ్గర నుండి తీసుకున్నారు. వాళ్లేమో సిల్క్ మిక్స్డ్ రీసైకిల్డ్తో తయారు చేసిన కార్పెట్ ఒకటి.. మన తెలంగాణ చేనేత కార్మికులు కష్టించి సాంచల మీద గంటల తరబడి కాళ్లు, చేతులు ఆడిస్తూ వాళ్లకున్న సృజనాత్మకత, మేథా శక్తిని మొత్తం కలగలిపి తయారు చేసిన కార్పెట్ ఇంకోటి.. ఒకటి కప్పుకుంటే వెచ్చగుంటది.. ఇంకోటేమో బొచ్చు అంటుకుంటదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ వివరించారు.
పేదింటి బిడ్డలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు చదువుకునే గురుకులాల్లో పంపిణీ చేసే బెడ్ షీట్లలో కూడా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి సర్కార్ దోపిడీ చేస్తుందని ఫైర్ అయ్యారు. బెడ్ షీట్ల టెండర్లను చేనేత కార్మికులకు ఇవ్వకుండా.. పాత గుడ్డలను రీ సైక్లింగ్ చేసే మఫత్ లాల్ కంపెనీకి గురుకుల టెండర్లను కట్టబెట్టి రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డదన్నారు. పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్ రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
పేదింటి బిడ్డలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ
మరియు మైనారిటీ పిల్లలు చదువుకునే గురుకులాల్లో పంపిణీ చేసే
బెడ్ షీట్లలో కూడా నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి దోపిడీ!బెడ్ షీట్ల టెండర్లను చేనేత కార్మికులకు ఇవ్వకుండా..
పాత గుడ్డలను రీ సైక్లింగ్ చేసే మఫత్ లాల్ కంపెనీకి గురుకుల టెండర్లను కట్టబెట్టి
రూ. 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ రేవంత్ సర్కార్.పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్ రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా?
గురుకుల టెండర్స్ ను టెస్కో ద్వారానే ఇవ్వాలని
డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ @sravandasoju 🔥— BRS Party (@BRSparty) November 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

