Health tips | లావుపొట్టను ఇట్టే తగ్గించే ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా..?
Health tips | చాలామంది ఊబకాయం (Obesity) సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి ఊబకాయం లేకపోయినా కేవలం లావుపొట్టతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావుపొట్ట కారణంగా కుదురుగా కూర్చోవాలన్నా, వంగాలన్నా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు పొట్ట తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు.
Health tips : చాలామంది ఊబకాయం (Obesity) సమస్యతో బాధపడుతున్నారు. కొందరికి ఊబకాయం లేకపోయినా కేవలం లావుపొట్టతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లావుపొట్ట కారణంగా కుదురుగా కూర్చోవాలన్నా, వంగాలన్నా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వారు పొట్ట తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఫలితం లేక విసిగిపోతారు. కానీ ఈ డ్రింక్ (Drink) ను రోజుకు రెండుసార్లు తాగితే మీ పొట్ట ఇట్టే కరిగిపోతుందని నిపుణులు (Experts) చెబుతున్నారు. మరి ఆ డ్రింక్ ఏమిటి..? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి..? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
తయారీ ఇలా..
ఒక స్పూన్ అల్లం పేస్టు, రెండు అంగుళాల దాల్చిన చెక్క, ఒక నిమ్మకాయ, అర స్పూన్ మిరియాలతో ఈ స్పెషల్ డ్రింక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో రెండు గ్లాసులు నీళ్లు పోయాలి. తర్వాత అందులో అల్లం పేస్టు, దాల్చిన చెక్క, స్పూన్ మిరియాలు కచ్చాపచ్చాగా దంచుకుని కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలుగా కోసి అందులో వేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఓ పది నిమిషాలపాటు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి ఒక పరిశుభ్రమైన పాత్రలోకి తీసుకోవాలి. అంతే మీ పొట్టను తగ్గించే స్పెషల్ డ్రింక్ రెడీ అయినట్టే. ఈ స్పెషల్ డ్రింక్‌ను ఉదయాన్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి వరుసగా కొన్ని రోజులపాటు గోరువెచ్చగా తాగాలి. ఇలా చేస్తే 15 రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఒంట్లోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. బానపొట్ట నాజూగ్గా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి మరీ..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | లావుపొట్టను ఇట్టే తగ్గించే ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా..?
Cancer | మధుమేహం ఉన్నవారికి 21 రకాల క్యాన్సర్ల ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bandla Ganesh | చెక్ బౌన్స్ కేసు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష.. రూ.95 లక్షల జరిమానా..!
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
Man Throws Sons Into Canal | ఇద్దరు కుమారులను కాలువలోకి విసిరేసిన తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్ల దాడి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

