Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
Health Tips | ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఈమధ్య కాలంలో పెరుగుతున్నది. చాలామందిలో ఈ సమస్య ఉన్నా స్వల్ప లక్షణాలతో గుర్తించలేకపోతారు. అయితే గుర్తించేసరికి సమస్య ముదిరి కాలేయం దెబ్బతినడం మొదలవుతుంది. అధిక కొవ్వులు ఉండే ఆహారం (Food), జంక్ ఫుడ్ (Zunk Food), ఆల్కాహాల్ (Alcohal) అలవాటు వంటివి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తాయి.
Health Tips : ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య ఈమధ్య కాలంలో పెరుగుతున్నది. చాలామందిలో ఈ సమస్య ఉన్నా స్వల్ప లక్షణాలతో గుర్తించలేకపోతారు. అయితే గుర్తించేసరికి సమస్య ముదిరి కాలేయం దెబ్బతినడం మొదలవుతుంది. అధిక కొవ్వులు ఉండే ఆహారం (Food), జంక్ ఫుడ్ (Zunk Food), ఆల్కాహాల్ (Alcohal) అలవాటు వంటివి ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తాయి. శరీరానికి వ్యాయామం లేకపోవడం కూడా ఈ సమస్యను పెంచుతుంది. అయితే కొన్ని రకాల పండ్ల (Fruits) ను తరచూ తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నియత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అవకాడోలు
వీటిలో ఆరోగ్యకరమైన ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాంతోపాటు మన కాలేయం సమర్థవంతంగా పనిచేసేందుకు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించేందుకు తోడ్పడే రసాయన సమ్మేళనాలు కూడా వీటిలో ఎక్కువ. ఇవి కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
పొప్పడిపండ్లు
వీటిలో అద్భుతమైన జీర్ణ సంబంధిత ఎంజైములు ఉంటాయి. ఈ ఎంజైములు జీర్ణశక్తిని పెంచడంతోపాటు కాలేయాన్ని రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో, పోషకాలను శరీరం బాగా సంగ్రహించడంలో పొప్పడిపండు బాగా పనిచేస్తుందని అంటున్నారు.
దానిమ్మ
దానిమ్మలో పాలిఫెనాల్స్గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడుతాయి. కాలేయం చుట్టూ కొవ్వు చేరకుండా అడ్డుకుంటాయి. మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా బాగా తోడ్పడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
నారింజ, బత్తాయి, నిమ్మ
నిమ్మజాతి పండ్లలో విటమిన్ సి ఎక్కువ. విటమిన్ సి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడంలో కాలేయానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుందని, దీనివల్ల కాలేయం సమర్థంగా పనిచేస్తుందని అంటున్నారు.
పుచ్చపండు
పుచ్చపండ్లలోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. కాలేయం నుంచి విష పదార్థాలను బయటికి పంపించి, సమర్థవంతంగా పనిచేసేందుకు ఇవి తోడ్పడతాయి. ఇవి శరీరంలో నీటి శాతం తగిన స్థాయిలో ఉండేలా చూస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బెర్రీలు
బెర్రీ జాతి పండ్లలో విభిన్నమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. అదే సమయంలో కాలేయం సమర్థవంతంగా విష పదార్థాలను వడగట్టేందుకు తోడ్పడతాయి.
యాపిల్స్
వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దాని చుట్టూ కొవ్వు చేరకుండా నియంత్రిస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యను అరికడతాయని నిపుణులు వివరిస్తున్నారు.
గమనిక
పండ్లు ఏవైనా సరే ఆరోగ్యానికి మంచితే అయినా షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని అంటున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

