భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ శనివారం నల్లగొండ నగరంలోని పలు భవాని మాత విగ్రహాల మండపాలను సందర్శించి, అభిషేక, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పున్నవెంకన్న ఆధ్వర్యంలో ఐదవ డివిజన్ డైట్ ఎదురుగా భవాని మాత...
నల్లగొండ, అక్టోబర్ 17 : నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ శనివారం నల్లగొండ నగరంలోని పలు భవాని మాత విగ్రహాల మండపాలను సందర్శించి, అభిషేక, అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పున్నవెంకన్న ఆధ్వర్యంలో ఐదవ డివిజన్ డైట్ ఎదురుగా భవాని మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మారగొని గణేష్ ఆధ్వర్యంలో ఏడవ డివిజన్లో ఏర్పాటు చేసిన భవాని మాత అభిషేక కార్యక్రమంలో గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి కంచర్ల పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మండప నిర్వహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం పదవ డివిజన్లో ఏర్పాటు చేసిన భవాని మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
చివరగా వెంకట సాయి ఫంక్షన్ హాల్ దగ్గరలో జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భవాని మాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావం తొలగిపోయి, మంచి వర్షాలు కురిసి ప్రజల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలియజేశారు. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జున రెడ్డి, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ కౌన్సిలర్, కార్పొరేటర్ మారగోని భవాని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు జిల్లా శంకర్, వజ్జ శ్రీనివాస్, పున్న వెంకన్న, వీరమల్ల సందీప్, నాగరాజు, కోట్ల జయపాల్ రెడ్డి, రేగట్టే మహేందర్ రెడ్డి, కోట్ల అశోక్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

