POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
POCSO : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలిక పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటనలో బాలికను పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.
POCSO : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలిక పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటనలో బాలికను పెళ్లి పేరుతో మోసం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. నాగ్‌పూర్ పరిధి, పంచ్పవోలిలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో చదువుతున్న సమయంలో బాలికకు గత ఏడాది ఒక యువకుడు పరిచయమయ్యాడు.
తర్వాత బాలికను తన ఇంటికి రప్పించుకున్నాడు. గత ఏడాది ఆగష్టు 25న బాలిక అతడి ఇంటికి వెళ్లింది. అక్కడ బాలికపై లైంగిక చర్యకు పాల్పడ్డాడు. అంతేకాదు.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలిక మైనర్ అని తెలిసినప్పటికీ ఆ యువకుడు ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో కొంతకాలానికి బాలిక గర్భం దాల్చింది. ఇటీవల ఆ బాలిక ఒక పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు బాలిక వయసు 16 సంవత్సరాలు. నిందితుడి వయసు 18. బాలిక పాపకు జన్మనివ్వడంతో ఈ విషయం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో బాలిక కుటుంబం.. ఆ బాలుడిపై ఫిర్యాదు చేసింది. స్పందించిన పంచ్పౌలి పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ సాగుతోందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Nagpur
- POCSO
- school
- sexual abuse
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

