హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల్లో కొవిడ్, సంబంధిత ఇతర అంశాలపై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ బుధవారం అన్ని రాష్ర్టాల వైద్యారోగ్య కార్యదర్శులతో సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్, విపత్తు అత్యవసర ప్రతిస్పందన నిధి (పాండమిక్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్యాకేజ్), ఆయుష్మాన్ భారత్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలోని కొవిడ్ పరిస్థితుల గురించి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ కేంద్రమంత్రికి వివరించారు.