Drumsticks | మనకు అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చాలా మంది తమకు నచ్చిన కూరగాయలను తరచూ కొని వాటితో కూరలు చేసుకుని తింటుంటారు. అయితే చాలా మంది కొన్ని రకాల కూరగాయలను సహజంగానే ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిల్లో మునక్కాయలు కూడా ఒకటి. మునక్కాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో అనేక రకాల కూరలను చేయవచ్చు. మునక్కాయలను ఎక్కువగా చారు వంటి వాటిల్లో వేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే మనకు అనేక పోషకాలను అందిస్తాయి. మునక్కాయలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మునక్కాయలను తరచూ తినాలని వారు సూచిస్తున్నారు. వీటి వల్ల పలు వ్యాధులను నయం చేసుకోవచ్చని వారు అంటున్నారు.
మునక్కాయల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా క్వర్సెటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, విటమిన్ సి వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించేందుకు సహాయం చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ కాయల్లో ఉండే సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. కనుక ఈ కాయలను తింటుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే గుండె కండరాలు, రక్త నాళాల వాపులు సైతం తగ్గిపోతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. మునక్కాయలను తరచూ తినడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. వీటిని తింటుంటే డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
మునక్కాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. మునక్కాయలను తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు పడుతుంది. మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాయల్లో క్యాల్షియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. దీని వల్ల వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు.
మునక్కాయలను తినడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. లివర్ లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. మునక్కాయల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. వీటిని తరచూ తింటుంటే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. ఇక 100 గ్రాముల మునక్కాయలను తింటే మనకు సుమారుగా 37 క్యాలరీల శక్తి లభిస్తుంది. ప్రోటీన్లు 2.1 గ్రాములు, పిండి పదార్థాలు 8.5 గ్రాములు, ఫైబర్ 3.2 గ్రాములు, కొవ్వు 0.2 గ్రాములు, విటమిన్ సి 141 మిల్లీగ్రాములు, పొటాషియం 461 మిల్లీగ్రాములు, క్యాల్షియం 30 మిల్లీగ్రాములు, మెగ్నిషఙయం 45 మిల్లీగ్రాములు, ఐరన్ 0.36 మిల్లీగ్రాములు లభిస్తాయి. కనుక వీటిని తింటుంటే అనేక పోషకాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.