ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఎస్లో పనిచేస్తున్న బి.రమేష్ అనే హెడ్ కానిస్టేబుల్ మేడారంలోని టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, మగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.