Lokesh Kanagaraj | ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు నటుడిగా మారబోతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డీసీ’ (DC). ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheshwaran) దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తుంది. లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బీ కథానాయికగా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను వాలంటైన్స్ కానుకగా విడుదల చేసింది చిత్రయూనిట్. గ్లింప్స్ లో లోకేష్ కనగరాజ్ ఇంటెన్స్ అండ్ రా లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. లోకేష్ ఇందులో దేవదాస్ పాత్రలో కనిపించబోతున్నాడు.