హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అమలులోకి వచ్చిన ఈ నిర్ణయంతో రుణాలపై నెలవారి చెల్లింపులు మరింత అధికంకానున్నాయి. దీంతో నెల కాలపరిమితి రుణాలపై వడ్డీరేటు 15 బేసిస్ పాయింట్లు పెరగడంతో వడ్డీరేటు 8.10 శాతానికి, నెల రుణాలపై రేటు 8.20 శాతానికి చేరుకున్నది.
మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రుణరేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి ఎగబాకింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రేటు 8.80 శాతం నుంచి 8.85 శాతానికి చేరుకున్నది. కానీ, ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై రేటును యథాతథంగా ఉంచడం విశేషం.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

