హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం జారీచేసిన జీవోల ప్రకా రం 25 శాతం ఉచిత చికిత్స కోటా కింద క్యాన్సర్ బాధితురాలికి వైద్యం అందించాలని హైకోర్టు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ దవాఖానను ఆదేశించింది. జగిత్యాల జిల్లాకు చెందిన బాలె భాగ్యమ్మను తక్షణమే చేర్చుకొని చికిత్స ప్రారంభించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
జీవో నం.434, జీవో నం.80 అమలు తీరు, ఉచిత చికిత్స కోటా అమలుపై నివేదిక సమర్పించాలని డీఎంహెచ్‌వోను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. బసవతారకం దవాఖాన యాజమాన్యం 25 శాతం ఉచిత కోటా కింద చికిత్స నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బాలె భాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టారు.