పేదలపై ఇందిరమ్మ భారం 460 కోట్లా?
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మరో కుంభకోణానికి తెరలేపిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి సరార్ పేదల నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దోపిడీకి పూనుకుంటున్నదని, బార్ టెండర్ల విధానాన్ని ఇందిరమ్మ ఇండ్లకు కూడా అమలు చేస్తున్నదని ఆరోపించారు.
- ఇండ్ల పేరుతో 6 లక్షల వసూలు అన్యాయం
- ఉచితంగా ఇండ్లు ఇవ్వాలి
- బీఆర్ఎస్ నేతలు రాకేశ్‌కుమార్, వై సతీశ్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మరో కుంభకోణానికి తెరలేపిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి సరార్ పేదల నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో దోపిడీకి పూనుకుంటున్నదని, బార్ టెండర్ల విధానాన్ని ఇందిరమ్మ ఇండ్లకు కూడా అమలు చేస్తున్నదని ఆరోపించారు.
మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 7,680 ఇండ్లకు పేదల నుంచి రూ.460 కోట్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన విధంగానే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.6 లక్షల వసూలు సీమ్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన పేరును ‘రాఘవ క్రషర్స్ శ్రీనివాస్‌రెడ్డి’గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో కర్ణాటక వాళ్ల ఓట్లతోనే రేవంత్‌రెడ్డికి మెజారిటీ వచ్చిందని విమర్శించారు.
ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా: వై సతీశ్‌రెడ్డి
ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. అశోక్‌నగర్‌లో విద్యార్థులపై లాఠీచార్జి జరిగితే స్పందించని రాహుల్‌గాంధీ, ఢిల్లీలో మాత్రం విద్యార్థులపై లాఠీచార్జ్ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మౌనంగా ఉండి, పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ఇవ్వడం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

