వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన ప్రతిష్టాత్మక ఈవీవీ సినిమా పతాకంపై ఎన్వీ కృష్ణారెడ్డితో కలిసి ఆర్యన్ రాజేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజజీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ భావోద్వేగపూరిత ప్రేమకథలో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నటిస్తున్నారు. అరుణ్ బాలాజీ, శ్రీరంజని కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానున్నదని మేకర్స్ తెలిపారు.
వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో భావోద్వేగాల తీవ్రత బలంగా ఉంటుందని, అద్భుతమైన కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనున్నదని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, నిర్మాణం: ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్.