నిజ జీవిత కథ ఆధారంగా..
వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన ప్రతిష్టాత్మక ఈవీవీ సినిమా పతాకంపై ఎన్వీ కృష్ణారెడ్డితో కలిసి ఆర్యన్ రాజేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజజీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ భావోద్వేగపూరిత ప్రేమకథలో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నటిస్తున్నారు.
వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన ప్రతిష్టాత్మక ఈవీవీ సినిమా పతాకంపై ఎన్వీ కృష్ణారెడ్డితో కలిసి ఆర్యన్ రాజేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజజీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ భావోద్వేగపూరిత ప్రేమకథలో హర్ష్ రోషన్, ప్రియాంక ఆచర్ జంటగా నటిస్తున్నారు. అరుణ్ బాలాజీ, శ్రీరంజని కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానున్నదని మేకర్స్ తెలిపారు.
వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో భావోద్వేగాల తీవ్రత బలంగా ఉంటుందని, అద్భుతమైన కథ, కథనాలతో ఈ సినిమా తెరకెక్కనున్నదని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జిజు సన్నీ, నిర్మాణం: ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

