ముంబై, జూలై 4 (నమస్తే తెలంగాణ): రుతు పవనాల ప్రభావంతో మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై మహా నగరంలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల తీవ్రత ఊహించిన దానికంటే ఎకువగా ఉందని, ఈ సంక్షోభం 6వ తేదీ వరకు కొనసాగుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.
ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ (ఎంఎంఆర్), పాల్ఘర్, థానే, నవీ ముంబై, భివండి, వసాయి-విరార్, సతారా, పశ్చిమ కనుమల ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. పలుచోట్ల ఇండ్లలోకి వరద నీరు చేరింది. జాతీయ రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబై, థానే, ఫాల్ఘర్ జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది.