లక్నో, జూలై 4: ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించటం, అందులో ప్రావీణ్యం పొందటం అంత సులువు కాదు. అలాంటి అసాధారణ మార్గంలో పయనించి అద్భుత ప్రతిభతో 9 ఏండ్ల బాలిక శ్వేతిమ మాధవ్ ప్రియ ప్రపంచ రికార్డ్ సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన శ్వేతిమ అంతర్జాతీయ భాగవత ప్రవచన కర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సాధించింది. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
2017 ఫిబ్రవరి 16న జన్మించిన శ్వేతిమ..ఆరేండ్ల వయసులోనే శ్రీమద్భాగవత కథ చెప్పటం ప్రారంభించింది. ఇప్పటివరకు 100కు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలు, నైతక విలువల సందేశాన్ని ప్రజలకు చేరవేసింది.