న్యూఢిల్లీ, జూలై 10: హ్యారీ పోటర్ ఫాంటసీ కథల్లో చెప్పుకునే ‘సలాజర్ పిట్ వైపర్’ నిజ జీవితంలోకి వచ్చింది. చాలా ఏండ్ల తర్వాత మళ్లీ అది అస్సాంలోని ‘కజిరంగ జాతీయ పార్క్’లో కనపడింది. ఇందుకు సంబంధించి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘చూశారా..! ఇది హ్యారీ పోటర్ రియల్ లైఫ్ స్నేక్. ఆకుపచ్చ రంగులో సూపర్ కూల్‌గా ఉంది. ఎరుపు, ఆరెంజ్ రంగులతో ప్రకృతి చేసిన అద్భుతం ఇది’ అని ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘హ్యారీ పోటర్’ ఫాంటసీ కథల్లో కనిపించే పాము చాలా పాపులర్. ఇలాంటి పాము.. 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో మొదటిసారి కనపడగా, ఆ పాముకు ‘హ్యారీ పోటర్’ నవలల్లోని విలన్ పాత్ర ‘సలాజర్ స్లిథరిన్’ పేరు పెట్టారు.