హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు మూడ్రోజులుగా నిరంతరం పర్యవేక్షిస్తూ వారి కుటుంబానికి అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు.. ఆదివారం హనుమకొండలోని దవాఖానకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో కలిసి వెళ్లి పరిస్థితులను సమీక్షించిన హరీశ్‌రావు, మెరుగైన వైద్యం కోసం పెద్దిని హైదరాబాద్ యశోదకు తరలించే వరకూ వెన్నంటే ఉన్నారు.
సోమవారం పార్టీ అధినేత కేసీఆర్ పెద్దిని పరామర్శించేందుకు రాగా, ఆయన కంటే ముందే హరీశ్‌రావు దవాఖానకు వెళ్లి ఏర్పాట్లను సమీక్షించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు సరైన వైద్యం అందించేలా వైద్యులను అప్రమత్తం చేశారు. మంగళవారం కూడా హరీశ్‌రావు యశోద దవాఖానకు వెళ్లి ఐసీయూలో ఉన్న సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఆయనకు అందిస్తున్న చికిత్స, కోలుకుంటున్న తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
యశోద దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డిని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు. అనంతరం పెద్ది కుటుం బ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు.