దశ మార్చిన దశాబ్ది.. 33 జిల్లాల అభివృద్ధి.. ప్రదాత కేసీఆర్ 10కే రన్లో హరీశ్
కొత్త జిల్లాలు.. ప్రగతి పునాదులు.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రేపటితో పదేండ్లు.. వికేంద్రీకరణతో అభివృద్ధి పరుగులు.. ప్రజలకు చేరువైన ప్రభుత్వ సేవలు.. 2016లో జిల్లాల పునర్వ్యవస్థీకరణతో రాష్ట్ర ముఖచిత్రం మార్చిన కేసీఆర్
- 33 జిల్లాలను ఏర్పాటు చేయడంతో స్థానిక సంస్థల బలోపేతానికి తోడ్పాటు
- ఊపందుకొన్న ఉపాధి అవకాశాలు.. విద్య, పారిశ్రామిక, ఆర్థికరంగం వృద్ధి
- జాతీయ అవార్డులే నిదర్శనం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సాధికారతకు బాటలు
- త్యాగం, పోరాటంతోనే స్వరాష్ట్రం
- ఎన్నో దశాబ్దాల సిద్దిపేట జిల్లా కలను సాకారం చేసిందీ కేసీఆరే
- పదేండ్లలో పరుగులు తీసిన ప్రగతి
- దశాబ్ది ఉత్సవాల్లో హరీశ్‌రావు
- వేలాది మందితో హుషార్‌గా 10కే రన్
సిద్దిపేట, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో 33 జిల్లాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దకుతుందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటు అనేది ఒకరోజులో పుట్టిన ఆలోచన కాదని, దాదాపు మూడు దశాబ్దాలపాటు ఎన్నికల నినాదంగా, గోడ రాతలుగా మిగిలిపోయిన ప్రజల ఆకాంక్ష పేర్కొన్నారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సిద్దిపేటకు వచ్చినప్పుడు సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ అంబేదర్ విగ్రహం వద్ద కేసీఆర్ వినతిపత్రం సమర్పించారని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాతే 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారని వివరించారు.
జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన 10కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన విద్యార్థి, యువజన సదస్సులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డితో కలిసి పాల్గొన్నారు. సాయంత్రం టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ… రిజర్వాయర్లు, ఆలయాలు, విద్యాసంస్థలతో సిద్దిపేట ప్రత్యేక గుర్తింపు సాధించిందని, యూనివర్సిటీని కూడా తీసుకొనిరావడానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చరిత్ర తెలిస్తే పోరాటాల విలువ తెలుస్తుంది
ప్రతి మనిషికీ తమ ప్రాంత చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత భారతదేశ చరిత్రతోపాటు తెలంగాణ ఉద్యమ చరిత్రను, తమ ప్రాంత చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రాంతానికి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నదని వివరించారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపంతోపాటు సిద్దిపేట రంగధాంపల్లి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని స్మారక చిహ్నాలు తెలంగాణ పోరాట చరిత్రను గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సహా పలువురు నేతలు తెలంగాణ ఆకాంక్షను సజీవంగా ఉంచారని చెప్పారు.
ప్రాణాలను పణంగా పెట్టి..
2001లో పదవులను తృణప్రాయంగా వదిలి కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆమరణ నిరాహార దీక్షతో పోరాడి 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని హరీశ్‌రావు వివరించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు కోతలు, సాగునీటి కొరత, నెర్రెలు బారిన పంట పొలాలు కనిపించేవని, అనంతరం కేసీఆర్ పదేండ్ల పాలనలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు రంగాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో అమలైన పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని ఉదహరించారు.
10కే రన్.. పది రెట్ల అభివృద్ధికి స్ఫూర్తి కావాలి
10కే రన్ ఉత్సాహం సిద్దిపేట భవిష్యత్తు అభివృద్ధికి ప్రతీక కావాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. గతంలో సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా, రేపటి సిద్దిపేట ఎలా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నేటి పది కిలోమీటర్ల పరుగు.. రేపటి పది రెట్ల అభివృద్ధికి బాటలు వేయాలని ఆకాంక్షిస్తూ దశాబ్ది ఉత్సవాల్లో యువత భాగస్వామ్యాన్ని హరీశ్‌రావు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

