రాజుగా మారిన పేదవాడి కథ?
రాజుగా మారిన పేదవాడి కథ? కెరీర్లో 100వ సినిమాకు ఉండే ప్రత్యేకతే వేరు. స్టార్ హీరోలంతా తమ నూరవ చిత్రం కచ్ఛితంగా బ్లాక్‌బస్టరే కావాలని కోరుకుంటారు. తమ హీరో ల్యాండ్‌మార్క్ మూవీ అనగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.
రాజుగా మారిన పేదవాడి కథ? కెరీర్లో 100వ సినిమాకు ఉండే ప్రత్యేకతే వేరు. స్టార్ హీరోలంతా తమ నూరవ చిత్రం కచ్ఛితంగా బ్లాక్‌బస్టరే కావాలని కోరుకుంటారు. తమ హీరో ల్యాండ్‌మార్క్ మూవీ అనగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. దర్శక, నిర్మాతలకు సైతం ఇది ప్రతిష్టాత్మకమే. ప్రస్తుతం అగ్ర కథనాయకుడు అక్కినేని నాగార్జున తన ల్యాండ్ మార్క్ మూవీ ‘కింగ్ 100’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రా.కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
ఇదిలావుంటే.. ఈ సినిమా కథ ఇదేనంటూ ప్రస్తుతం ఓ లైన్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నది. పేదరికం నుంచి అత్యంత ధనవంతుడిగా ఎదిగి, ఒక రాజుగా మారిన వ్యక్తి కథ ఇదని, 50వేల కోట్ల భారీ స్కామ్‌లో చిక్కుకున్న ఆ వ్యక్తి ఏ విధంగా ఆ స్కామ్ నుంచి బయటపడ్డాడు? అనే ప్రశ్నకు సమాధానంగా సినిమా కథ నడుస్తుందని ఇన్సైడ్ టాక్. రిచ్‌గా సాగే ఈ ైస్టెలిష్ యాక్షన్ డ్రామా నాగార్జున్ కెరీర్లోనే స్పెషల్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 28 ఏండ్ల విరామం తర్వాత నాగార్జునతో కలిసి టబూ నటిస్తుండటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

