తెలంగాణ పెండ్లి జోష్ చూస్తారు!
పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో ‘క్రేజీ కల్యాణం’ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు నిర్మాత బూసం జగన్మోహన్ రెడ్డి. తరుణ్‌భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, నరేష్ వీకే, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకుడు. ఈ నెల 16న విడుదలకానుంది.
పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో ‘క్రేజీ కల్యాణం’ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు నిర్మాత బూసం జగన్మోహన్ రెడ్డి. తరుణ్‌భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, నరేష్ వీకే, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకుడు. ఈ నెల 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్మాత బూసం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో ప్రభుత్వ యాడ్స్, డాక్యుమెంటరీలు చేశానని, నిర్మాతగా తనకది రెండో చిత్రమని తెలిపారు. ‘యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అన్ని ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ కథ విన్న ప్రతీ ఒక్కరూ అద్భుతంగా ఉందని చెప్పారు. దసరా టైమ్‌లో సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది.
తెలంగాణ పెద్ద పండగ దసరా. ఈ సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. పెళ్లి నేపథ్యంలో జరిగే ఈ కథలో వినోదంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయి. తెలంగాణ పెళ్లి జోష్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఈ సినిమా చూశాక ప్రేక్షకులు మంచి ఫీల్‌తో బయటకు వస్తారు’ అని బూసం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ కథ విన్నప్పుడు అనుపమ పరమేశ్వరన్‌నే కథానాయికగా అనుకున్నామని, ఆమెను తప్ప మరొకరిని ఈ పాత్రకు ఊహించుకోలేమని ఆయన చెప్పారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని.. గోరటి వెంకన్న, కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్ వంటి తెలంగాణ కవులు అద్భుతమైన పాటల్ని అందించారని తెలిపారు. దాదాపు రెండొందల థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

