హైదరాబాద్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK ) పార్టీ ఘన విజయం సాధించడం పట్ల బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు ( MLA Harish Rao ) ట్విటర్లో స్పందించారు. ఈ సందర్భంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ ( Vijay ) కు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైన అరంగేట్రం చేసిన నటుడు విజయ్‌కు అభినందనలు తెలిపారు ఈ ప్రజా తీర్పు ప్రజల ఆశలను ప్రతిబింబిస్తోందని, ప్రజా జీవితంలో ఆయన తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.