కోల్‌కతా: జాల్ముడి(‘Jhalmuri) ఇప్పుడు బెంగాల్ సింబలైంది. మురమురాల స్నాక్‌ను బెంగాల్ ప్రజలు రస్మలై తరహాలో పంచుకుంటున్నారు. తాజా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ విజయ కేతనం ఎగుర వేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్ స్నాక్‌గా గుర్తింపు ఉన్న జాల్ముడిని బీజేపీ నేతలు షేర్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఇటీవల జార్గ్రామ్లో ప్రధాని మోదీ ఓ షాపుకు వెళ్లి జాల్ముడి(మురమురాల స్నాక్) తిన్న విషయం తెలిసిందే. తాను జాల్ముడి తింటే, దాని ఘాటు టీఎంసీకి తగిలిందని రెండో దశ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ అన్నారు. జాల్ముడి అద్భుతం చేసిందని కేంద్ర మంత్రి రిజిజు ఇవాళ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వర్కర్లు జాల్ముడి స్నాక్‌ను షేర్ చేసుకుంటున్నారు.
झालमुड़ी का झाल! #Jhalmuri 🔥 pic.twitter.com/plJyPey8cz
— Kiren Rijiju (@KirenRijiju) May 4, 2026
ట్రెండింగ్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 200 స్థానాల్లో, టీఎంసీ 87 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.