Supritha | ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తెగా ప్రేక్షకులకు పరిచయమైన సుప్రిత ఇటీవల తన వ్యక్తిగత జీవితంలోని కఠిన అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, ప్రస్తుతం హీరోయిన్గా సినీ రంగంలో ముందుకు సాగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుప్రిత, సోషల్ మీడియాలో ఎదురైన విమర్శలు, బాడీ షేమింగ్ కామెంట్లు తనపై తీవ్ర ప్రభావం చూపాయని చెప్పారు. బరువు తగ్గాలనే ఆరాటంలో తాను అనుసరించిన తప్పుడు ఆహారపు అలవాట్లు తన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయని వెల్లడించారు.రోజుకు 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉండి, తర్వాత ఒక్కసారిగా హెవీ ఫుడ్ తీసుకునేదాన్ని. దీంతో వాంతులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి.
15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. నీళ్లు తాగినా కూడా పడని పరిస్థితి. ఆ నొప్పి తట్టుకోలేక ఒక దశలో ‘నన్ను చంపేయండి’ అని అమ్మను అడిగాను అంటూ తన అనుభవాన్ని వివరించారు. ఈ ఘటన తనను మానసికంగా కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న సుప్రిత తన కెరీర్‌పై స్పష్టతతో ముందుకు సాగుతున్నారు. కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించడానికి సిద్ధమని తెలిపారు.
ఇక అగ్ర హీరోల సినిమాల్లో కూడా తాను నటించాలనే ఆసక్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ సినిమాల్లో చెల్లెలి పాత్రలు వచ్చినా చేయడానికి రెడీ అని చెప్పారు. అయితే తనకు ఇష్టమైన విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేని సరసన అలాంటి పాత్రలు చేయడం కష్టమని సరదాగా వ్యాఖ్యానించారు. సుప్రిత ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తల్లి ప్రోత్సాహంతో నటనలో శిక్షణ తీసుకున్న ఆమె, ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించారు. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి సరసన నటిస్తున్న ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్ ఫ్రెండ్’ షార్ట్ ఫిల్మ్‌తో ప్రారంభమైన సుప్రిత ప్రయాణం, ఇప్పుడు వెండితెరపై మరింత బలంగా కొనసాగుతోంది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.