రేవంత్ కండ్లు తెరిచి చూడు!
‘రేవంత్‌రెడ్డీ.. కండ్లు తెరిచి చూడు. నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఊరూరా బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలుంటాయ్' అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు స్పష్టంచేశారు.
- కొడంగల్‌లో ఊరూరా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలుంటయ్
- మూడేండ్లలో నువు ఏంచేశావో చెప్పు
- నీ కష్టం ప్రజల కోసమా? కమీషన్లకా?
- కొడంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
- వ్యాఖ్యలకు హరీశ్‌రావు కౌంటర్
సిద్దిపేట, నవంబర్ 7( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రేవంత్‌రెడ్డీ.. కండ్లు తెరిచి చూడు. నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో ఊరూరా బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలుంటాయ్’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు స్పష్టంచేశారు. మూడేండ్లలో ఒకరోజూ సెలవు తీసుకోకుండా కష్టపడుతున్నానంటున్న రేవంత్‌రెడ్డి.. నీ కష్టం ప్రజల కోసమా? లేక కమిషన్లు కొట్టడం కోసమా? అని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం శేఖర్‌రావుపేట గ్రామంలో శనివారం వాటర్‌ప్లాంట్ ప్రారంభించిన అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు.
కొడంగల్ సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు వెళ్లి తమను తిడుతూ.. ‘కొడంగల్‌కు కేసీఆర్ ఏంజేసిండు.. హరీశ్‌రావు ఏంజేసిండు’ అని అడుగుతున్నారని పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డీ.. కండ్లు తెరిచి చూడు! కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొడంగల్‌లో రెండు 50 పడకల దవాఖానలు కట్టించాం. కొత్తగా ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేశాం. ప్రతి తండాకు అద్భుతమైన బీటీ రోడ్లు వేశాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చాం. మిషన్ కాకతీయ కింద కొడంగల్ చెరువులన్నీ బాగుచేశాం.
మారెటింగ్ శాఖ ద్వారా ప్రతి మండలానికీ గోదాములు కట్టించాం’ అని వివరించారు. ‘నువ్వు అంతలా కష్టపడితే కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంటు.. ఇప్పుడు నీహయాంలో 7 గంటలకు ఎందుకు పడిపోయింది? మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు కాలిపోతున్నయ్’ అని ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధు వేస్తే.. రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టాడని విమర్శించారు. సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకెళ్లారని, 1,000 పడకల దవాఖాన, నర్సింగ్ కాలేజీ పనులను మధ్యలోనే ఆపేశారని ఆరోపించారు. రంగనాయక సాగర్ కాలువలు మేము 90 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 10 శాతం పనుల్లో మూడేండ్లయినా తట్టెడు మట్టి కూడా తీయని అసమర్థ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. ఏ ఊరిలోనూ గజం తారు రోడ్డు వేసిన పాపాన పోలేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

