హరీశ్కల్యాణ్ హీరోగా రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాషమకాన్’. ప్రీతి ముకుందన్ కథానాయిక. వనీత్ వరప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. హీరోను చంపేందుకు వెంబడిస్తున్న హంతకులు… వారి ఆట కట్టించిన హీరోను ఈ ప్రోమోలో చూడొచ్చు.
హీరో పాత్ర ఇందులో భిన్నంగా ఉంటుందని, రెండు కోణాల్లో పాత్ర సాగుతుందని, ఆ షేడ్స్ వెనకున్న కథ ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సునీల్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ అశోకన్, సంగీతం: బ్రిట్టో మైకేల్.