రవి, శ్రీయ తివారి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘విచిత్ర’. సైఫుద్దీన్ మాలిక్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదల కానుంది. అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో మనసుల్ని హత్తుకునేలా సినిమా ఉంటుందని దర్శక,నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ చెప్పారు.
జ్యోతి అపూర్వ, బేబీ శ్రీ హర్షిణి, రవి ప్రకాశ్, సూర్య, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: నిజాని, అంజన్.