యువనటుడు సుమంత్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘గోదారి గట్టుపైన’. నిధి ప్రదీప్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుభాష్ చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ‘చూడు.. చూడు..’ అంటూ సాగే ఈ పాటను దినేష్ కాకర్ల రాయగా, నాగవంశీకృష్ణ స్వరపరిచారు. హరిచరణ్ ఆలపించారు.
ప్రేమలో ఉన్న అందమైన, చురుకైన అమ్మాయిని కవితాత్మకంగా వర్ణిస్తూ ఈ పాట సాగింది. సుమంత్ ప్రభాస్ డాన్స్ మూమెంట్స్, నిధి ప్రదీప్ యాటిడ్యూడ్ ఈ పాటకు హైలైట్స్. రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్, నిర్మాణం: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్.