సంగీత దర్శకుడు రమణ గోగుల సంగీత యాత్రకు సిద్ధమయ్యారు. ఆయన పాటల్నీ, వాటి వెనుక కథల్నీ ప్రపంచానికి తెలియజేస్తూ ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకూ రమణ గోగుల ఈ యాత్రను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలిపేందుకు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ యాత్రను ‘డాక్యు- మ్యూజికల్ సిరీస్‌గా’ ఆసాంతం చిత్రీకరించి ఓటీటీలో కూడా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా రమణ గోగుల తెలిపారు.
రానున్న ఫిబ్రవరి నుంచి ఈ యాత్ర మొదలవుతుందని, ఆస్ట్రేలియా నుంచి మొదలైలండన్, అమెరికా మీదుగా యాత్ర సాగుతుందని, కళ, కథల ద్వారా ప్రవాస భారతీయులను ఏకం చేయడమే ఈ సంగీత యాత్ర లక్ష్యమని రమణ గోగుల చెప్పారు. ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ – రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్’ పేరిట ఈ యాత్ర జరుగనున్నది. మెల్బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్టైన్మెంట్ ఆస్ట్రేలియా సంస్థలు కలిసి ఈ యాత్రను నిర్వహించనున్నాయి.