జార్జ్‌టౌన్: వెస్టిండీస్ టూర్లో ఉన్న హార్దిక్ పాండ్యా.. మాజీ ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కీరన్ పోలార్డ్ ఇంటికి వెళ్లాడు. ప్రస్తుతం విండీస్‌తో టీ20 సిరీస్ జరగుతున్న విషయం తెలిసిందే. ఇండియా ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్నది. శని, ఆదివారాల్లో చివరి రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న పాండ్యా.. టీ20ల్లో ఆడుతున్నారు. ఈమధ్యే పోలార్డ్ ఇంటికి పాండ్యా వెళ్లాడు. పోలార్డ్ ఆహ్వానం మేరకు వాళ్ల ఫ్యామిలీతో పాండ్యా కలిశాడు. హార్దిక్ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేశాడు. కింగ్స్ ఇంటికి వెళ్లకుండా కరీబియన్ టూర్ పూర్తి కాదు అని హార్దిక్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. నా ఫెవరేట్ ప్లేయర్ కీరన్ పోలార్డ్ అని, అందమైన ఫ్యామిలీ ఉందని, ఆతిథ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ హార్దిక్ ట్వీట్ చేశాడు.
No trip to the Caribbean is complete without a visit to the King’s home ❤️❤️ Polly my favourite and your beautiful family, thank you for hosting me my brother 🥰❤️😘 @KieronPollard55 pic.twitter.com/pGdhNX0n6l
— hardik pandya (@hardikpandya7) August 4, 2022