Hardik Pandya | ఓటమి మంచిదే.. సిరీస్ చేజారడంపై పాండ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Hardik Pandya | వెస్టిండీస్‌తో ఐదో టీ20లో భారత్ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్ఇండియా ప్రభావం చూపలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడింది. అయితే ఈ మ్యాచ్ ఓటమిపై అలాగే తొలిసారి అతడి కెప్టెన్సీలో సిరీస్ ఓడిపోవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
Hardik Pandya | వెస్టిండీస్‌తో ఐదో టీ20లో (WI vs IND) భారత్ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్ఇండియా ప్రభావం చూపలేకపోయింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడింది. దీంతో 3-2తో టీమ్ఇండియా సిరీస్ కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్ ఓటమిపై అలాగే తొలిసారి అతడి కెప్టెన్సీలో సిరీస్ ఓడిపోవడంపై కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందించాడు.
“నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఉన్న ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాం. వేగంగా రన్స్ చేయలేకపోయాము. ఈ ఓటమిపై ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మా ఆటగాళ్లు ఎలా ఆడారనేది నాకు తెలుసు. గెలుపు, ఓటములు అనేవి ఆటలో ఒక భాగం. మాకు వన్డే ప్రపంచకప్ వస్తోంది. కొన్నిసార్లు ఓడిపోవడం కూడా మంచి చేస్తుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఓటమిలో చాలా విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. మా అబ్బాయిలందరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వాళ్లు తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇక ఈ మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ అమెరికాలోనే జరగనుంది. అప్పుడు ఇంకా ఎక్కువమంది అభిమానులను కలుస్తాం” అని పాండ్య చెప్పుకొచ్చాడు.
ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌సెంచరీతో రాణించగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (18 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ (55 బంతుల్లో 85 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. పూరన్ (35 బంతుల్లో 47; ఒక ఫోర్, 4 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో తిలక్‌వర్మ, అర్ష్‌దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
Losing is good sometimes, it can teach you a lot of things. On the positive side, we have done a lot of learnings.
– Hadik Panda (Indian captain) pic.twitter.com/vhknAICUQK
— CricTracker (@Cricketracker) August 13, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

