చండీగఢ్: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కొత్త ఇన్నిం గ్స్ మొదలుపె ట్టాడు. ఇటీవలే తన సుదీర్ఘ అంతర్జాతీ య క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్‌కు ఆమ్ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఈనెల 31న జరుగనున్న రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నిక కోసం ఆప్ ఐదుగురు సభ్యులను ప్రకటించింది. ఇందులో భజ్జీతో పాటు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, సంజీవ్ అరోరా, అశోక్‌కుమార్‌ను ఎంపిక చేసింది. సోమవారం పంజాబ్ విధానసభలో హర్భజన్ నామినేషన్ దాఖలు చేశాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భజ్జీ ఇది వరకే ప్రకటించినట్లు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి తన పంథా ఏంటో తెలియజేశాడు.