Haka Farmers Service Center | గంగాధర, ఏప్రిల్ 20 : గంగాధర మండలం మధురానగర్ లో హాక ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీసీఎంఎస్, రైతు సేవా కేంద్రాల మాదిరిగానే హాక సర్వీస్ సెంటర్ ద్వారా వ్యవసాయ సేవలు అందుతాయని తెలిపారు.
రైతులు హాక సర్వీస్ సెంటర్లను వినియోగించుకొని వ్యవసాయ సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురుమల్ల మనోహర్, సర్పంచ్లు సంఘం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, సర్పంచ్లు కాడరి రేణుక కనుకయ్య, వేముల భాస్కర్, రెండ్ల శ్రీనివాస్, బాస వేణి శ్రీనివాస్, తూం రాజు, సత్తు కనుకయ్య, సాగి అజయ్ రావు, మేర్జ కొండయ్య, ప్రేమ్ కుమార్, మంత్రి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.