ముంబై: హజ్ యాత్ర – 2022కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమైందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఆసక్తి ఉన్నవాళ్లు జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే సాగుతుందని వివరించారు. కరోనా నిబంధనల మేరకే యాత్రికుల ఎంపిక ఉంటుందన్నారు. తోడు లేకుండానే హజ్ యాత్రకు వెళ్లాలనుకొనే మహిళలను నేరుగా ఎంపిక చేసేలా లాటరీ నుంచి మినహాయిస్తామని ఆయన పేర్కొన్నారు.