కేంద్రం తీరు బాధాకరం : రాహుల్ గాంధీ
కేంద్రం తీరు బాధాకరం : రాహుల్ గాంధీ | కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఉంటే..

న్యూఢిల్లీ : కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రస్తుతం విదేశాల నుంచి భారత్ సాయం పొందే అవసరం వచ్చేది కాదన్నారు. విదేశాల నుంచి సాయం పొందుతూ కూడా కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడం బాధాకరమని రాహుల్ ట్వీట్ చేశారు. ‘విదేశాల సాయం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం పదేపదే గొప్పగా చెప్పుకోవడం బాధాకరం. ప్రభుత్వం తన బాధ్యతను సరిగా నిర్వర్తించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు’ అని పేర్కొన్నారు.
వివిధ దేశాల నుంచి అందుతున్న సాయంపై కేంద్రం పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సహాయక సామగ్రి వివరాలను చెప్పాలని కోరుతోంది. మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి సాయం అందుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఐర్లాండ్, రొమేనియా, సింగపూర్, స్వీడన్, కువైట్ దేశాలు టెస్ట్ కిట్లు, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, మందులతో పాటు అవసరమైన సామగ్రిని అందజేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఈ లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్
పుదుచ్చేరి ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
అమెరికాలో కాల్పుల కలకలం.. రెండు ఘటనల్లో 11 మంది మృతి
అసోం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న హిమంత
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. ఎన్నికల ఫలితాలపై మేథోమధనం
వాహనాదరులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హర్యానాలో మరో వారం లాక్డౌన్ పొడగింపు
ఉత్తరాఖండ్‌లో రేపటి నుంచి కర్ఫ్యూ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

