తాండూర్ : భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా తాండూర్ మండలానికి చెందిన ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా( Habib Pasha) నియామకమయ్యారు.
బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్టీయూ కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, ఆటోయూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, రాష్ట్ర కార్యదర్షి నిలరాపు రవి, రేణిగుంట సురేష్ ఆధ్వర్యంలో ఎండీ హబీబ్ పాషా ను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ నియామక పత్రం అందజేసారు.
ఈ సందర్భంగా హబీబ్ పాషా రాష్ట్ర నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం కష్టపడుతూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.