నీలగిరి, జనవరి 31 : నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం మర్రిగూడ గ్రామంలోని పలు కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అన్ని రంగాల్లో వెనుక బడినందున పట్టణంలోని ఆదర్శ డివిజన్‌గా మార్చేందుకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు. తాను కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహకారంతో దాదాపు కోటి రుపాయలకు పైగా నిధులతో మర్రిగూడ అభివృద్ధి చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుంకరబోయిన రవి, కడారి యాదయ్య, గట్టయ్య, మర్రి మల్లేష్, మచ్చ శంకర్, రాంలక్ష్మణ్ రాజు పాల్గొన్నారు.