Nilagiri : మర్రిగూడలో గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ప్రచారం
నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం మర్రిగూడ గ్రామంలోని పలు కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నీలగిరి, జనవరి 31 : నల్లగొండ కార్పొరేషన్ 13వ డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి గున్రెడ్డి రాధికాయుగేందర్రెడ్డి ఓటర్లను కోరారు. శనివారం మర్రిగూడ గ్రామంలోని పలు కాలనీల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. అన్ని రంగాల్లో వెనుక బడినందున పట్టణంలోని ఆదర్శ డివిజన్‌గా మార్చేందుకు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు. తాను కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సహకారంతో దాదాపు కోటి రుపాయలకు పైగా నిధులతో మర్రిగూడ అభివృద్ధి చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరోసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుంకరబోయిన రవి, కడారి యాదయ్య, గట్టయ్య, మర్రి మల్లేష్, మచ్చ శంకర్, రాంలక్ష్మణ్ రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

