– ఓటర్లను కోరిన నల్లగొండ 15వ బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్
నీలగిరి, జనవరి 31 : ఫిబ్రవరి 11వ తేదీన జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో నల్లగొండ 15వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపించేందుకు కారు గుర్తుపై ఓటేయాలని ఆ పార్టీ అభ్యర్థి దొడ్డి రమేష్ ఓటర్లను కోరారు. శనివారం డివిజన్ పరిధిలోని చర్లపల్లిలో గల పలు కాలనీల్లో కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓటేయాలని అభ్యర్థించారు. సీఎం కేసీఆర్ హయాంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సహకారంతో చర్లపల్లిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు ఓపెన్ డ్రైన్లను నిర్మించి లో ఓల్టేజీ సమస్యను సైతం తీర్చామన్నారు. అర్హులందరికి పింఛన్లు అందజేయడం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీవాసులు సిద్దగోని శ్రీనివాస్, కడారి నర్సింహ్మ, నరాంల అజయ్‌కుమార్ పాల్గొన్నారు.