కోఠి : నగరంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7 గంటలకు కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. రషీద్ అనే వ్యక్తి ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తుండగా దుండగులు అతడిపై కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రషీద్ డబ్బులు డిపాజిట్ చేయడానికి వస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి దుండగులు అతడిని వెంబడించినట్లు తెలుస్తోంది.
దుండగుల కాల్పుల్లో రషీద్ కాలుకు తూటా గాయం అయ్యింది. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీమ్ ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది.