గుండాల, డిసెంబర్ 11: ఓ ఉద్యోగిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల తాసిల్దార్ ఉల్ఫాల దయాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్ (సీసీఎల్ఏ)కు సరెండర్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తాసిల్దార్ తనపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, రాత్రి వేళల్లో ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని తాసిల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఈ నెల 8న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కలెక్టర్ శనివారం తాసిల్దార్‌ను సీసీఎల్ఏకు సరెండర్ చేశారు.