వజ్రాలకు కొవిడ్ దెబ్బ.. అదేం లేదన్న సూరత్ ఇండస్ట్రీ
వజ్రాలకు కొవిడ్ దెబ్బ| వలస వచ్చిన కార్మికులు తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోనే అత్యంత విలువైన వజ్రాల పరిశ్రమపైనా ప్రభావం...

సూరత్: కరోనా రెండో వేవ్.. భారతీయుల్లో ఆందోళన పెంచేసింది.. కేంద్రం జాతీయ స్థాయిలో లాక్డౌన్ లేదని ప్రకటించినా.. రాష్ట్రాలు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్డౌన్లు, కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోనే అత్యంత విలువైన వజ్రాల పరిశ్రమపైనా ప్రభావం కనిపిస్తున్నది.
గుజరాత్‌లోని సూరత్ పట్టణం వజ్రాల తయారీ, వాటికి డిజైన్లకు పెట్టింది పేరు.. రమారమీ సూరత్ వజ్రాల వ్యాపారం టర్నోవర్ రూ.1.45 లక్షల కోట్లు.
ఈ పరిశ్రమపై కనీసం ఐదు లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వీరికి సూరత్‌లోని చిన్న, పెద్ద డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లు 3000 వరకు ఉపాధి కల్పిస్తున్నాయి.

కరోనా రెండో వేవ్ ప్రభావం తమ ఇండస్ట్రీపై లేదని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రకటిస్తున్నా.. కొవిడ్-19 నీలినీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు.
ఈ మూడు రాష్ట్రాలతోపాటు గుజరాత్‌లోని సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ రీజియన్ల నుంచి భారీగానే కార్మికులు సూరత్‌కు వచ్చి పని చేస్తూ తమ కుటుంబాల జీవనం సాగిస్తున్నారు.
మెజారిటీ వలస కార్మికులు గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల వారేనని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాను వెకారియా చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు.. మొత్తం వజ్రాల తయారీ కార్మికుల్లో 10 శాతమేనని నాను వెకారియా చెప్పారు.
ఈ ఐదు లక్షల మందిలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే సొంతూళ్లకు వెళ్లారన్నారు. వారిలో ఇతర రాష్ట్రాలు, గుజరాత్‌లోని ఇతర రీజియన్ల వారూ ఉన్నారు.

పెండ్లిండ్లు, ఇతర సామాజిక వేడుకల కోసం కొందరు వెళితే, మరికొంత మంది భయంతో వెళ్లారని వెకారియా వ్యాఖ్యానించారు. ఇంకొందరు అనారోగ్యంతో బాధపడుతున్న తమ తల్లిదండ్రులు, బంధువుల బాగోగులు చూసుకునేందుకు వెళ్లారన్నారు. వారి పనులు పూర్తి కాగానే వచ్చేస్తారన్నారు.
మెజారిటీ డైమండ్ పాలిషింగ్ యూనిట్లు యధావిధిగా పని చేస్తున్నాయి. తక్కువ మంది వలస కార్మికులు మాత్రమే వెళ్లిపోయారు. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత తిరిగి వస్తారని వెకారియా వెల్లడించారు.
కానీ, చాలా మంది కార్మికులు మాత్రం లాక్డౌన్ విధిస్తారన్న భయంతోనే సొంతూళ్లకు వెళ్తున్నామని చెప్పడం గమనార్హం. గురువారం రికార్డు స్థాయిలో గుజరాత్లో 8,152 మందికి కరోనా సోకింది.
ఇవి కూడా చదవండి..
ఈనెల 30 వరకు గురుకులసెట్ దరఖాస్తులు
నీట్-2021వాయిదా
కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా
చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్ఐ
రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్ కర్ఫ్యూ
ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..
ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్ సీఈఓ
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి
కరోనా సెకండ్ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

