Group 1 Mains | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో మూడు ప్రశ్నల్లో అక్షర దోషాలు, అచ్చుతప్పులు దొర్లాయి. వ్యాసరూప ప్రశ్నలు కావడంతో సమాధానాలు రాసేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. రెండోరోజైన మంగళవారం జరిగిన జనరల్ ఎస్సే పేపర్‌కు 31,383 మంది అభ్యర్థులకు గాను 21,817 (69.4శాతం) హాజరయ్యారు. 10 వేల మంది డుమ్మాకొట్టడం గమనార్హం. ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు కొందరు తెలుపగా, మరికొందరు మాత్రం సులభంగా ఉన్నట్టు తెలిపారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 పేపర్ తరహాలోనే ప్రశ్నలు ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు.
జనరల్ ఎస్సే పేపర్ ప్రశ్నపత్రంలో తప్పులివే..
దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 22: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశపరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ జలపతి తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో వచ్చే నెల 5 వరకు స్వీకరించనున్నట్టు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 8 వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెల 9న పరీక్షను నిర్వహిస్తామని తెలిపారు. టీఎస్ఐసెట్-2024లో అర్హత సాధించినవారు పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదని, వారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. వివరాలకు www. ouad missions. com, www. osmania. ac. in, www.oucde.net వెబ్సైట్లలో చూసుకోవాలని సూచించారు.