నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రోటరీ క్లబ్ ఆర్థిక సహాయంతో భూమి పూజ చేశారు. హైదరాబాద్కు చెందిన రోటరీ క్లబ్ సభ్యులు మదన్మోహన్ ఆదిత్య, కిరణ వారి స్నేహితుల బృందం అదనపు తరగతి గదులను నిర్మించడానికి ముందుకొచ్చారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి తారాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేయడం హర్షణీయమన్నారు. రోటరీ క్లబ్ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీశైలం, మల్లయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు, సి ఆర్ పి రాధా గోపాల్, రోటరీ క్లబ్ ప్రతినిధులు గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.