
ఊట్కూర్, డిసెంబర్ 9 : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్‌రావత్, ఆయన సతీమణి మధూలికరావత్తోపాటు పలువురు సైనికాధికారులు మరణించిన విషయం తెలిసిందే. వారికి గురువారం మండలంలోని చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. భరతమాత సేవలో బిపిన్‌రావత్ 43 ఏండ్లపాటు సుదీర్ఘ సేవలనందించి దేశ రక్షణ వ్యవస్థను ఎంతో పటిష్టం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్నాథ్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జై జవాన్ అంటూ నినాదాలు
నారాయణపేట, డిసెంబర్ 9 : పట్టణంలోని కృష్ణవేణి హై స్కూల్లో గురువారం త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు అమరులైన జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఘనం గా నివాళులర్పించారు. బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి, రెండు నిమిషాలపాటు మౌ నం పాటించారు. చిత్రపటం చుట్టూ వలయాకారంలో నిలబడి జై జవాన్-జై కిసాన్ అం టూ నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ న రేశ్ మాట్లాడుతూ బిపిన్ రావ త్ మరణవార్త యావత్ దే శాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తీవ్ర గాయాలతో బ యటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హిందూవాహిని, బీజేపీ ఆధ్వర్యంలో…
ధన్వాడ, డిసెంబర్ 9 : హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెం దిన వీరజవాన్లకు మండలంలోని బస్టాండ్ ఆవరణలో గురువా రం హిందూవాహిని, బీజేపీ ఆధ్వర్యంలో త్రివిధ దళాధిపతి బి పిన్ రావత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించి కొవ్వొత్తుల ప్రదర్శించారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రామచంద్రయ్య, జుట్ల సుదర్శన్ గౌడ్, చాకలి బాలరాజు, సిరిగిరి నాగరాజ్, రవి తోపాటు పులువురు పాల్గొన్నారు.
చివరి రక్తపు బొట్టు దేశానికే అంకితం
మక్తల్ టౌన్, డిసెంబర్ 9 : చివరి రక్తపు బొట్టు దేశానికే అం కితం చేసిన యుద్ధ వీరుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో గురువారం త్రివిధ దళాధిపతి బిపిన్ రా వత్, సతీమణి మధూలికరావత్తోపాటు 13 మంది యుద్ధవీరులను కోల్పోయిన వారి చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం లో చనిపోయిన తెలుగు సైనికుడు సాయితేజ్ దేశ సేవకు అంకితమై ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. నాలుగు దశాబ్దాలపాటు మాతృభూమికి నిస్వార్థంగా సేవలందించిన బిపిన్ రావత్ సేవలు మరువు లేనివి అని కొనియాడారు. అదేవిధంగా పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయం ఎ దుట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి ఆధ్వర్యం లో బిపిన్ రావత్ చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధి రామలింగం, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో…
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 9 : త్రి విధ దళాధిపతి బిపిన్ రావత్‌కు జ డ్చర్లలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బిపిన్ రావత్‌కు కొ వ్వొత్తులతో నివాళులర్పించారు. జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి బిపిన్ రావత్ దంపతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. బిపిన్ రావత్ అమర్హై అంటూ నినాదాలు చేస్తూ శ్రద్దాంజలి ఘటించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.