హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తేతెలంగాణ) : మహేశ్వర మహా పిరమిడ్ గురువు పత్రీజి జయంతి సందర్భంగా సోమవారం కడ్తాల్‌లోని ట్రస్ట్ ఆవరణలో సభ్యులు మొకలు నాటారు. మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొకలు నాటడం చాలా ఆనందంగా ఉన్నదని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. లక్షలాది మొకలు నాటిన ..ఈ మహాకార్యంలో తమను కూడా భాగస్వామ్యం చేసిన సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాధవి, నిర్మల, చంద్రశేఖర్, ఉమా, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.